కరీంనగర్: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ’

-

అంతర్గాం: రామగుండం క్రషర్ నగర్ నుండి ఓ లారీ బూడిద లోడ్ చేసుకొని తిరిగి కరీంనగర్ వెళ్తుండగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉంటున్న దంపతుల చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version