రామగుండం సింగరేణి ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు మృతిచెందారు. వీరిలో అసిస్టెంట్ మేనేజర్ నరేష్, ముగ్గురు కార్మికులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.