జగిత్యాల : స్థలాన్ని కాపాడాలని కలెక్టర్‌కు వినతి

జగిత్యాల పట్టణంలోని లింగం పేట రోడ్డు వైపు కమిటీ స్థలాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 6 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ మార్కెట్ రైతులకు పంటలు నిలువ చేసుకోవడానికి ఎంతో ఉపయోగ కరంగా ఉందన్నారు.