
ముగ్గురి హత్యల ఘటనతో టీఆర్ నగర్ భయం గుప్పిట్లో ఉంది. నాగేశ్వర్ రావు చిన్న కొడుకు రాజేశ్, రెండో భార్య కొడుకు విజయ్ భయంతో బంధువుల ఇళ్లలో తలదాచుకోగా ప్రస్తుతం నాగేశ్వర్ రావు కుటుంబ సభ్యుల్లో మహిళలు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. పోలీసులు వారికి అండగా ఉంటామని భరోసా కలిపిస్తున్నారు. టీఆర్ నగర్లో 10 వేల మంది జనాభా ఉండగా రెండు రోజులుగా ఇళ్లకే పరిమితమై పోయారు. రోజంతా వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.