అసెంబ్లీకి కేవలం అందుకోసమే వెళ్ళాడు : రవీంద్రారెడ్డి

-

ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లడం కూడా చర్చనా.. జగన్ అసెంబ్లీకి కేవలం సంతకం చేయడం కోసం మాత్రమే వెళ్ళాడు అని పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రారెడ్డి అన్నారు. రఘు రామ కృష్ణమరాజు ఆర్టికల్ పై ఎప్పుడైతే చర్చించాడో.. అప్పుడే 10 మంది ఎమ్మెల్యేలకు భయం పుట్టింది. రాష్ట్ర సమస్యలు మరియు పులివెందుల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తే బాగుంటుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయికాట్ చేశాడు. వాజ్పేయి, జైపాల్ రెడ్డి, ఇలాంటివారు ఒక సీటు రెండు సీట్లతోనే అసెంబ్లీలో తమ గొంతును వినిపించారు.

బై ఎలక్షన్లకు మేము సిద్ధమే దమ్ముంటే 11 మంది రాజీనామా చేయండి. బై ఎలక్షన్ లో పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేడు. ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే సినిమా చూపిస్తారు అని చెప్పారు. వివేకం సినిమా చూశాం వివేకం టు ఏమన్నా చూపిస్తారా ??.. వైయస్ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిచారంటే సునీత షర్మిల ఫోటోలు ఉంచుకోవాలి లేకుంటే ఎంపీ పదవి కూడా దక్కేది కాదు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు దద్దమ్మ కబుర్లు చెబుతున్నారో తెలుస్తాయి అని రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news