గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల గోడు చూడటానికి కూడా మంత్రి లోకేష్ ఇక్కడ లేరు. ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకుని దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మీకు దమ్ము, దైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. హోదా ఇస్తే జగన్ అసెంబ్లీకి వస్తారు. మేము జగన్ ను రానివ్వం అంటే ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం. ప్రజల చేతనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తాం.
అయితే జగన్ ప్రతిపక్షంలో కూర్చుంటే మీకు పోయేదేమీ లేదు. గతంలో జగన్ అనుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. వీళ్ళ లాంటి నీతిమాలిన పనులు చేయలేదు. ప్రజలను మోసం చేస్తాం.. దొంగ కేసులు పెడతాం అంటే ఎక్కువ రోజులు నడవవు. మిర్చి రైతుల వద్దకు జగన్ వెళ్లిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ చక్కని పాలన చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు అని రోజా ప్రశ్నించారు.