సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హత్నూర మండలంలోని పల్పనూరూ గ్రామాలలో కల్లు పాకెట్లు సరఫరా చేస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వారిని అడిగే వారు ఎవరూ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఈ నయా దందా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కల్లు నకిలీదా లేక కృత్రిమంగా తయారు చేసిందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.