నన్ను ఐరన్ లెగ్ అన్నారు..చాలా అవమానించారు : టాలీవుడ్ హీరోయిన్

-

కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మహానటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కు అటు పెద్ద పెద్ద సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ తన కెరీర్ ప్రారంభంలో తాను చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని కీర్తి సురేష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

“మలయాళం లో నేను చేసిన ఒక సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో నన్ను అందరూ ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారు. ఆ తర్వాత నాకు అవకాశాలు పోయాయి. అవమానాలు ఎదురయ్యాయి. ఆ ప్రచారం నుంచి నేను బయట పడడానికి మూడేళ్లు పట్టింది. కెరీర్ లో సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడడం కారణంగా తప్పకుండా సక్సెస్ అవుతాం. సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలు గా మార్చగలదు అని నేను భావిస్తాను ” అంటూ కీర్తి సురేష్ తాజాగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

కాగా కీర్తి సురేష్ తాజాగా నటించిన సినిమా గుడ్ లక్ సఖి. నిన్నటి రోజున ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. పాజిటివ్ టాక్ కూడా ఈ సినిమాకు వస్తోంది. ఇక అటు కీర్తి సురేష్ నటించిన సర్కార్ వారి పాట త్వరలోనే విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version