మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుండి చేగుంట వైపు వస్తున్న ఒక ఆటో అతి వేగంగా వెళ్తూ బోల్తా పడడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాసాయిపేట మండలం పోతంశెట్టి పల్లి గ్రామానికి చెందిన జయ రాములు గౌడ్ (70) వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.