అందోల్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు కావాల్సిన నిధుల గూర్చి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులను కోరుతామని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. అందులో భాగంగా శనివారం నగర పంచాయతీ నాయకులతో కలిసి స్థానిక అందోల్ చెరువును సందర్శించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.