మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాదులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దుబ్బాక చేనేత నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దుబ్బాక చేనేతలకు శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దుబ్బాక చేనేతలు అంటే తమకు ఎంతో అభిమానమని వారి అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.