ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

ఐనవోలు మల్లికార్జున స్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దయవల్ల నేను త్వరగా కోలుకున్నా అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.