బీజేపీ వ‌ర్సెస్ హ‌రీశ్ : ద‌ళితుల‌పై ప్రేమ ఉత్తిదే!

దళితులపై మాటల్లోనే ప్రేమను కురిపిస్తుందే తప్పితే.. బీజేపీ చేతల్లో చేసింది ఏమీ లేదని హరీష్ రావు విమర్శించారు. దళిత బంధు వంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా పథకాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో దళితులకు ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు హరీష్ రావు. కేంద్రం గత బడ్జెట్ లో దళితుల సంక్షేమం కోసం కేవలం రూ. 1.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

ఇలా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న 20.14 కోట్ల మందికి సగటున కేవలం రూ. 6 వేలు మాత్రమే వచ్చాయన్నారు. ఇదే తెలంగాణ దళిత కుటుంబాలపై సగటున రూ.35 వేలు ఖర్చు చేస్తుందన్నారు. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారని.. వారు కేంద్రంతో పోరాడి దళితుల డెవలప్మెంట్ కు నిధులు తీసుకురావాలన్నారు.

గత పదేళ్లలో కాంగ్రెస్ తెలంగాణలో దళితులకు ఖర్చు చేసిన నిధుల కన్నా గత ఏడున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేశామన్నారు. ఈవిషయం గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో 134 ఎస్సీ గురుకులాలు ఉంటే.. ప్రస్తుతం 268 ఎస్సీ గురుకులాలు తీసుకువచ్చామన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తుందని.. ప్రైవేటు పరం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడంతో దళితులు రిజర్వేషన్లు కోల్పోతున్నారని హరీష్ రావు అన్నారు.