ఎమ్మెల్యే జగ్గారెడ్డి తుపాకి రాముడు మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. తోక, తొండంలేని మాటలు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదని, సంగారెడ్డిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. గల్లీకో ఏటీఎం, 40 వేల ప్లాట్లు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.