రేపటి నుంచి 12-14 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ గాయత్రిదేవి తెలిపారు. 2010 మార్చి 15 కంటే ముందు జన్మించిన పిల్లలే వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యాశాఖలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.