మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మాంసం విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పశువధశాలలు లేకపోవడం, బల్దియా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని మాంసం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వధించే జంతువులను పశువైద్యాధికారి ధ్రువీకరించిన అనంతరం మున్సిపల్ హెల్త్ ఇన్స్పెక్టర్ ముద్ర వేసిన తర్వాత అమ్మకాలు చేపట్టాలి. కానీ జిల్లాలో ఇటువంటి విధానం ఎక్కడా అమలు కావడం లేదు.