మేడారం భక్తులతో వనం జనసంద్రమైంది. మేడారం భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగిపోతోంది. ఆధ్యాత్మిక పారవశ్యంతో ఊగిపోతోంది. తల్లుల రాక కోసం భక్తకోటి వేయి కళ్లతో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్ని దారులు అమ్మల వైపే.. భక్తులంతా అధిక సంఖ్యలో తల్లుల దర్శనానికి తరలొస్తున్నారు. దీంతో మేడారం జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది.