చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్న వాటిని ఉపేక్షించేది లేదని మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహా రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 11 భవనాలను కూల్చి వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఇప్పటికీ కొంతమందికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.