చైనా మాంజా విక్రయదారునిపై కేసు నమోదు

ఆలేరు: చైనా దేశానికి చెందిన నిషేదిత మాంజా దారాన్ని విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఆలేరుకు చెందిన కీర్తి సత్తయ్య ఇంట్లో లభించిన చైనా దేశ మాంజా బిండల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఇద్రీస్ ఆలీ తెలిపారు. చైనా మాంజ విక్రయం వల్ల పర్యావరణంలో సంచరించే పక్షులకు హాని కలిగిస్తుందని ఆ దారం విక్రయాన్ని మన దేశం నిషేదించింది ఎస్‌ఐ తెలిపారు. సత్తయ్యపై కేసు నమోదు చేశామన్నారు.