2021-22 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు దరఖాస్తుల కోసం జిల్లాలోని విద్యార్థుల నుంచి ఫ్రెష్ అండ్ రెన్యూవల్ దరఖాస్తులు గడువు ఈనెల 31 వరకు పొడిగించామని జిల్లా బీసీ అభివృద్ధి, సంక్షేమ శాఖ అధికారిణి పుష్పలత తెలిపారు. అర్హతను బట్టి పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న ప్రెష్, రెన్యువల్ విద్యార్థినీ, విద్యార్థులు తమ వివరాలను ఈ-పాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవలన్నారు.