రక్షణశాఖ భూములివ్వండి.. రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

-

ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎంవో అధికారి శేషాద్రి, మున్సిపల్ శాఖ సెక్రెటరీ దాన కిషోర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్ నాథ్ సింగ్ ను సీఎం కోరారు. హైదరాబాద్ లోని బాపూఘాట్ వద్ద మహాత్మగాంధీ విగ్రహం కోసం రక్షణ శాఖ స్థలాలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.

తెలంగాణ వరంగల్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. రాజ్ నాథ్ సింగ్ తో భేటీకి ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రితో సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version