నిబంధనలు పాటించని 9 బస్సులు సీజ్

హయత్‌నగర్: పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తున్నారు. నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేట రింగు రోడ్డు వద్ద ఆర్టీవో అధికారులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని మూడు ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు.