కర్మన్‌ఘాట్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దర్శించుకున్నారు. మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. గోరక్షకులను పరామర్శించారు. ఇటీవల కర్మన్‌ఘాట్ టెంపుల్ వద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బండి సంజయ్ హిందూ యువతను చంపేందుకు టెంపుల్‌లోకి రావడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.