తనిఖీలు.. ఆరు బస్సులపై కేసులు

శంషాబాద్ జాతీయ రహదారిపై రెండో రోజు రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు పాటించని ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.