వికెట్లు పడుతున్నాయి..సీఎంకు క్రికెట్ ఆడటం రావట్లేదు : యోగి పై అఖిలేష్ సెటైర్లు

-

ఫిబ్రవరి మాసంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు… మరో నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే దేశ ప్రజల దృష్టి మొత్తం ఉత్తరప్రదేశ్ ఎన్నికల పైనే ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి.. ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వస్తేనే కేంద్రంలో.. ఎన్డీఏ ప్రభుత్వం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఒకవేళ యూపీలో బీజేపీ అట్టర్ ఫ్లాఫ్ అయితే.. కేంద్రంలో మోడీ సర్కార్ దిగిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో… రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్యేలతో పాటు యోగి సర్కారులోని మంత్రులు బిజెపికి రాజీనామా చేస్తున్నారు.

రాజీనామా చేసిన నేతలంతా నేరుగా సమాజ్వాది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సమాజ్వాది పార్టీ లోకి జంప్ కాగా.. మరికొంత మంది నేతలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ సీఎం యోగి పై సెటైర్లు విసిరారు. బిజెపి వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయని… సీఎం యోగి అసలు క్రికెట్ ఆడటం తెలియడం లేదంటూ చురకలంటించారు. బీజేపీని గెలిపించేందుకు స్వామీ ప్రసాద్ మౌర్య ఇక్కడికి వచ్చారని… కానీ ఆయన వ్యూహాలు ఇక్కడ ఫలించవని అఖిలేష్ యాదవ్ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news