
ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 2022-23 సంవత్సరం బడ్జెట్ సమావేశం కార్యక్రమంలో.. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. 2022-23 బడ్జెట్ను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. పాలక మండలి ఏర్పడిన రెండు సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.