తెలంగాణలో రేషన్ సరుకులను ఈనెల 23వ తేదీ వరకూ తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు పౌరసరఫరాల ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ మాచన రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 20వ తేదీ వరకే సరుకులు తీసుకునే అవకాశం ఉండగా వివిధ జిల్లాల అవసరార్థం 23వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు.ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ది దారులుఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.