వీణవంకలో సమ్మక్క-సారక్క జాతర పనుల్లో MLC కౌశిక్ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. జాతరకి తమ 4 ఎకరాల స్థలంలో రామకృష్ణారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి MLC కౌశిక్ రెడ్డి నిధులు కేటాయించి 20 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటంపై రామకృష్ణారెడ్డి వర్గీయులు కోర్టుకెళ్లారు. నిర్మాణాలు చేపట్టవద్దని కోర్ట్ చెప్పనా కౌశిక్ రెడ్డి వర్గీయులు నిర్మాణాలు చేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది.