
వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుక్కల మహిపాల్ అనే వ్యక్తి ఇటీవల తన పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లు మృత్యువాత పడడంతో ఆయన తండ్రి జోగులు మందలించాడు. మనస్తాపం చెందిన ప్రవీణ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెతికినా అతని ఆచూకీ లభించలేదు. సోమవారం తిరుమలయ్య గుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.