41 మంది ఎస్సైలు బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీల పరంపర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పోలీసు అధికారులను బదిలీ చేస్తున్న పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఈ రోజు సైతం భారీగా పోలీసు అధికారులను బదిలీ చేశారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 41 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఈ రోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.