వరంగల్ కలెక్టర్ గోపిని కలిసిన జిల్లా అదనపు కలెక్టర్లు

వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమితులైన శ్రీవత్స బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన ఆయన పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గోపీని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోపి అదనపు కలెక్టర్ శ్రీవత్సను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, తదితరులు పాల్గొన్నారు.