పంటలను పరిశీలించిన కలెక్టర్

దుగ్గొండి మండలం పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి బుధవారం పరిశీలించారు. పంట నష్టంపై రైతులను, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను, కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అప్పులు చేసి పంటలు సాగుచేసి నష్టపోయామని, పలువురు రైతులు వాపోయారు. కలెక్టరు వెంట అధికారులు శ్రీనివాసరావు, తిరుపతి ఉన్నారు.