సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు గంగిరెద్దుల విన్యాసాలు, డూడూ బసవన్నలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. వచ్చే తరంలో అవి అంతరించి పోతాయేమో అని పలువురు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయానికి కాడెద్దులు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు దగ్గరే ఎద్దులు లేని పరిస్తితి దాపురించింది. పశుగ్రాసం దొరకక వాటిని పోషించడం రైతుకి కష్టం అవుతుంది.