ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని పీజీ వైద్య, విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. www. knruhs. telangana. gov. in లో వివరాలు చూడొచ్చు.