పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 25 నుండి 27 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు www.knruhs.telangana. gov.inలో చూడాలన్నారు.