హన్మకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం జాతీయ రహదారుల అథారిటీ, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. అధికారుల సర్వేను అడ్డుకోకుండా రైతులను, భూ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా పలువురు రైతులు భూములు కోల్పోతున్నామంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.