జైశంకర్‌పై దాడికి ఖలిస్థానీల కుట్రలు !

-

కేంద్ర మంత్రి జై శంకర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి జై శంకర్ పై దాడికి ఖలీస్తానీలు ప్రయత్నాలు చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జై శంకర్ లండన్ పర్యటనలో భద్రత లోపం తలెత్తింది. కొంత మంది ఖలీస్తాన్‌ సానుభూతిపరులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… రచ్చ చేశారు.

Khalistan protestor attempt to attack EAM S Jaishankar in London

అందులో ఉన్న ఒక నిరసనగారుడు కేంద్ర మంత్రి జై శంకర్ కారు వద్దకు దూసుకు వచ్చి దాడి చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. భారత జెండాను అవమానించేలా ఆ దుండగుడు ప్రవర్తించడం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిరసన కారులను అక్కడి నుంచి చెదరగొట్టారు లండన్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version