నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..35 అంశాలతో ఎజెండా

-

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ ఉండనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనుంది మంత్రివర్గం. దాదాపు 35 అంశాలతో ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్దతకు ఆమోదంపై తీర్మానం చేయనున్నారు.

Cabinet meeting chaired by CM Revanth Reddy at 2 pm

మెట్రో రైల్ ఫేజ్-2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన అంశాలపై చర్చ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్‌ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్ట్, నూతన టూరిజం పాలసీ, ఎకో టూరిజంపై చర్చ ఉండనుంది. భూభారతి మార్గదర్శకాలు, LRS, మైనింగ్ యాక్ట్ పై చర్చించనున్నారు. ఎక్సైజ్ పాలసీ, ధరల పెంపు అంశంపై ఎక్సైజ్ శాఖ నోట్, ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను చర్చించనుంది కేబినెట్. ఇందిరా మహిళా శక్తి అమలు, మహిళా సాధికారత కోసం మరో నూతన విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తాగు, సాగు నీటి అవసరాలు, నూతన, పెండింగ్ ప్రాజెక్ట్ లపై చర్చించనుంది కేబినెట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version