
చెరువులో మహిళ మృతదేహం కలకలం సృష్టించిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలోని రాయగిరిలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని రెండు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష(27)గా పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సంతోష ఈ నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.