కనీస జ్ఞానం లేని తీన్మార్ తిక్క మల్లన్న

-

భూరికార్డులను ఎలా నిర్వహిస్తారో, అసలు పట్టాదారంటే ఎవరో, అనుభవదారంటే ఎవరో తెలియని ఈ జేమ్స్‌బాండ్‌, భారీ స్కాములను బయటికితీసానని యూట్యూబ్‌లో చెత్త విడియోలు పోస్ట్‌ చేస్తూ, తన దద్దమ్మతత్వాన్ని బయటపెట్టుకుంటున్నాడని జనాలు నవ్వుకుంటున్నారు.దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నాడట వెనుకటికి ఓ ఎడ్డోడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను చూస్తే అట్లనే అనిపిస్తున్నది. వాడెవడో తమిళ ఆఫీసరు పోతూ పోతూ చెప్పాడట, ఈయన ఊపుతూ ఊపుతూ మైకులముందుకు వచ్చాడట. ఈయన దూడకు కూడా పాలు పితికే దాకా వెళ్ళాడు. ఇక విషయంలోకి…

ఆయన బయటపెట్టింది అతిపెద్ద కుంభకోణం కాదు, అత్యంత అజ్ఞాన ప్రదర్శన. మామూలు అజ్ఞానం కాదు. ఏంపెట్టి తోమినా తొలగిపోని అజ్ఞానం. కామన్‌సెన్స్‌కు కూడా అందని అజ్ఞానం. మోకాలుకు బోడిగుండుకు, మోచేతికి అరికాలికి… ఇలా ఎలా పడితే అలా ముడేసి మాట్లాడిన తిమిరం. ఇట్లాంటివాళ్ల నాన్‌సెన్స్‌కు స్పందించకపోవడమే మంచిదన్నాడో మిత్రుడు. తెలిసినోళ్లు మౌనం వహిస్తే, మూర్ఖులు రాజ్యమేలుతారు కదా అంటే, నీ ఇష్టం అన్నాడు. అందుకే ఈ స్పందన.

analysis on Teenmar Mallanna Comments

1. సాదా బైనామాలను ప్రవేశపెట్టింది ఖర్చుపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయిన పేద వాళ్ళకోసమే. ప్రయోజనం పొందింది అత్యధికంగా పేద ప్రజలే.

2. రెవిన్యూ రికార్డులు ఎక్కడ ఉంటాయో, ఎలా అప్‌డేట్‌ అవుతాయో ఈ బకరాకు తెలియదు. రెవిన్యూ రికార్డులు ప్రతి జిల్లాలో కలెక్టరు ఆధీనంలోని రికార్డుల గదిలో భద్రంగా ఉంటాయని, రికార్డుల మార్పులు చేర్పులు అన్నీఎమ్మార్వోలు చేస్తారని, ధరణి అన్నది కేవలం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం మాత్రమేనని ఈయనకు తెలియదు. ధరణి చూస్తున్నది గ్లోబెరేనా సంస్థ అని చెప్పడం ఇంకో పెద్ద అబద్దంNaveen kumar. రికార్డులన్నీ వాళ్లకు అప్పచెప్పారనడం దానిని మించిన అబద్దం. రెవిన్యూ రికార్డులను మార్పు చేయడం ముఖ్యమంత్రి వల్ల కూడా కాదని, రెవిన్యూ పంచనామా తర్వాతే రికార్డులు మారతాయని, అందుకు భిన్నంగా మార్పులు చేస్తే, అవి న్యాయ పరీక్షలో నిలబడవని ఈ హాఫ్ జ్ఞానికి తెలియదు. నాచారంలో తాను తీసుకున్న భూమికి సంబంధించి వినియోగ మార్పు చేయనందుకే ఎన్టీఆర్ పట్వారీలపై కోపం పెంచుకుని ఆ వ్యవస్థను రద్దు చేశాడని ఈయనకు తెలియదు.

3. తెలంగాణాలో కౌలు దారులకు భూములపై ఎటువంటి హక్కులు ఉండవనే కనీస జ్ఞానం లేదు. రెవిన్యూ రికార్డులలో ఆ కాలమ్ ఆరో వేలు వంటిది. భూమికి ఎప్పుడైనా పట్టాదారే యజమాని. పట్టాదారుకే పాసు పుస్తకం ఇస్తారు. అనుభవదారుకు కాదు. భూయజమాని తన పరిస్థితుల దృష్ట్యా సాగు వీలుకాని పక్షంలో, ఒకరికి కౌలుకు ఇచ్చి, ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుంటాడు. కౌలుదారంటే కిరాయిదారే. కౌలుదారుకు ఇంతకుముందు ఎప్పుడూ ఏ హక్కులు లేవు. ఇప్పుడు హక్కులు తొలగించింది లేదు. భూ చట్టాల గురించి, భూ రికార్డుల గురించి కొంచెం జ్ఞానం ఉన్న ఏ ఒక్కరు ఇలా మాట్లాడరు.

4. దొరలు వెనక్కు వచ్చి భూములు లాగేసుకోవడం కోసమే రికార్డుల ప్రక్షాళన చేశారని ఒక పచ్చి అబద్దాన్ని తేలిగ్గా వాగేశాడు ఈ కుహానా ఆక్టీవిస్ట్. కనీసం హోంవర్క్ చేయలేదు. వాడెవడో ఈయన చెవిలో ఏదో చెప్పాడు. ఆన్‌లైన్‌లో అవలీలగా దొరికే పహాణీ కాపీలను తీసుకొచ్చి మైకులముందు వాంతి చేసుకున్నాడు. 2010-11 రెవిన్యూ రికార్డులు తీయండి. ఇప్పటి రెవిన్యూ రికార్డులు తీయండి. అప్పటికీ ఇప్పటికీ పెద్ద భూకమతాల సంఖ్యా తగ్గింది. అప్పుడు పెద్ద రైతులు అంటే 25 ఎకరాలు పైగా భూమి కలిగినవారు 15775 మంది ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 6786కు తగ్గింది. రాష్ట్రంలో 50ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులు 298 మంది. వారి వద్ద ఉన్న భూమి 14600 ఎకరాలు. వారికిచ్చిన రైతుబంధు సొమ్ము 11.9 కోట్లు. రైతుబంధు పై ఖర్చు 12000 కోట్లు. 25 ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులు 6488. మొత్తం రైతుల్లో వీరి శాతం 0.11. రైతుబంధు పొందే మొత్తం రైతుల్లో 10 ఎకరాలలోపు రైతులు 57.5 లక్షలు. ఇక దొరలకు భూస్వాములకు దోచిపెట్టిందెక్కడ? వారికి మేలు చేసిందెక్కడ?

5. సచివాలయ నిర్మాణానికీ, భూ రికార్డుల ప్రక్షాళనకు లింకు పెట్టి మాట్లాడడమైతే మెడకాయమీద తలకాయ ఉన్నవారెవరూ చేయరు. రక్షణశాఖ భూములకోసం ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం భూ రికార్డుల ప్రక్షాళనకు ముందే మొదలైంది. కేంద్రం ఇదిగో అదిగో అంటూ సాగదీసి చివరకు నో చెప్పింది. అప్పుడే ఇప్పుడున్న సచివాలయాన్ని తొలగించి కొత్తది నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. ఆ దిశగా ప్రయత్నం మొదలైంది. అయినా రికార్డులన్నీ సచివాలయంలో ఉంటాయని చెప్పిన తలకు మాసిన వెధవ ఎవడు? రికార్డులు ఎక్కడో ఒక చోట ఒక ప్రతి మాత్రమే ఉంటే, హైదరాబాద్ చుట్టూ ఎమ్మార్వో కార్యాలయాల్లో జరిగిన అగ్నిప్రమాదాలు వాటిని ఎప్పుడో తగలేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఎప్పటికప్పుడు రికార్డుల నిర్మాణం, నిర్వహణ కొనసాగుతూనే ఉంది. రెవిన్యూశాఖలో జరుగుతున్న అక్రమాలకు బలిపశువులవుతున్నది పేద రైతులే అనేది పేపర్లు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అవి వారి స్వంత భూములు. అనుభవదారులుగా కాదు, పట్టాదారులుగా ఉండీ బాధపడుతున్నారు.

6. రెడ్లు, వెలమలు, అందరు దొరలూ ఏకమయ్యారని, అందుకే ఏ పార్టీల నాయకులూ మాట్లాడడం లేదని ఓ ఆరోపణ చేసిపారేశాడు. ఎవడన్నా తెలిసీ తెలియక ఈ బోడిలింగం వాదన పట్టుకుని బజారులోకి వస్తే జనం నవ్విపోతారు. కేసీఆర్ మీద కోపం, అక్కసు, ద్వేషం ఉంటే ఉంచుకోండి. కానీ మైకుంది, సోషల్ మీడియా ఉంది ఏమైనా మాట్లాడతాం అంటే, శోష వచ్చి పడిపోయేది మీరే. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.

– సిద్ధార్థ

Read more RELATED
Recommended to you

Latest news