ఎడిట్ నోట్: ‘బలం’ కోసం ‘బీజేపీ’!

-

తెలంగాణలో వరుసపెట్టి సర్వేలు బయటకొస్తున్నాయి…ఇప్పటికే ముందస్తు ఎన్నికలపై మూడు ప్రధాన పార్టీల మధ్య సవాళ్ళ పర్వం నడిచిన సంగతి తెలిసిందే…కేసీఆర్ మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని…ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ చెబుతూనే ఉన్నాయి. కానీ దీనిపై టీఆర్ఎస్ నుంచి స్పందన రాలేదు..ముందస్తు ఉండదనే ఆ పార్టీ నేతలు కవర్ చేసుకుంటూ వచ్చారు..కానీ తాజాగా బీజేపీ టార్గెట్ గా చెలరేగిన కేసీఆర్…దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించాలని, తానే అసెంబ్లీని రద్దు చేస్తానని బీజేపీకి సవాల్ విసిరారు.

ఈ సవాల్ పై బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది..ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము రెడీ అని, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని కౌంటర్ ఇచ్చింది. అటు కాంగ్రెస్ సైతం…ఈ ఏడాది ఆఖరికి జరిగే గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా పెట్టుకోవచ్చని, కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంటే ముందస్తుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడీ అయ్యాయి…ఇంకా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయడమే ఉంది.

ఇలా ముందస్తుకు సంబంధించి రాష్ట్రంలో రగడ నడుస్తున్న సమయంలో ఆరా సంస్థ సంచలన సర్వే వివరాలని బయటపెట్టింది..గతం కంటే టీఆర్ఎస్ ఓటింగ్ తగ్గిందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 39 శాతం వరకు ఓట్లు వస్తాయని, అటు బీజేపీకి 30 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 23 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 87 చోట్ల, కాంగ్రెస్ పార్టీకి 53 చోట్ల, బీజేపీకి 29 చోట్ల బలమైన అభ్యర్ధులు ఉన్నారని చెప్పింది.

ఇక ఇదే సమయంలో ఆత్మసాక్షి సర్వే కూడా బయటకొచ్చింది..ఈ సర్వే ప్రకారం..39 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 56-59, కాంగ్రెస్ 31 శాతం ఓట్లతో 37-39 సీట్లు, బీజేపీ 21 శాతం ఓట్లతో 14-16 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఎలాగో మజ్లిస్ పార్టీ 2.75 శాతంతో 7 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. అయితే రెండు సర్వేల్లో చాలా తేడా ఉందని చెప్పొచ్చు. రెండు సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం ఒకేలా ఉంది…కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓట్ల శాతం మారాయి.

అయితే సర్వే వివరాలు ఎలా ఉన్నా సరే ముందు బీజేపీ బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది…అంటే 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు కావాలి. బలమైన అభ్యర్ధులు ఉంటే ఆటోమేటిక్ గా బీజేపీ బలపడుతుంది.  ఆరా సర్వే లో కూడా అదే తేలింది…బీజేపీకి కేవలం 29 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్ధులు ఉన్నారు. అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ లతో పోలిస్తే బీజేపీ చాలా వీక్ గా ఉంది…119 నియోజకవరాల్లో కేవలం 29 చోట్లే బలమైన అభ్యర్ధులు ఉన్నారంటే….బీజేపీకి 90 స్థానాల్లో బలమైన అభ్యర్ధులు లేరని అర్ధమవుతుంది. కాబట్టి బీజేపీ..కేసీఆర్ పై విమర్శలు చేయడం కంటే ముందు అన్నీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టాల్సిన అవసరం ఉంది.

బీజేపీలో లేకపోతే ఇతర పార్టీలో ఉండే బలమైన నేతలని లాగాల్సి ఉంటుంది…ఇప్పటికే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ యాక్టివ్ గా ఉంది..ఆ కమిటీ చేయాల్సిన పని ఇదే…టీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో ఉన్న బలమైన అభ్యర్ధులని బీజేపీలోకి తీసుకురావాలి. ఎంత బలమైన నేతలు వస్తే బీజేపీకి అంతగా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని ఆరా సర్వేలో తేలింది. కాబట్టి బీజేపీ బలం ఇంకా పెంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version