ఎడిట్ నోట్: కారు-కాంగ్రెస్ హోరాహోరీ.!

-

తెలంగాణలో రాజకీయం హోరాహోరీగా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. అయితే ఈ యుద్ధంలో కేవలం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కనిపిస్తున్నాయి. బి‌జే‌పి వెనుకబడింది. మొన్నటివరకు బి‌జే‌పి రేసులో ఉంది..కానీ తర్వాత నుంచి బి‌జే‌పి రేసులో లేదు. దీంతో కారు, కాంగ్రెస్ మధ్యే పోరు ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.

రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల మాదిరిగా బి‌ఆర్‌ఎస్ పార్టీ వన్ సైడ్ గా గెలవడం చాలా కష్టమైన పని. ఈ సారి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వనుంది. ఇక బి‌జే‌పి 10 శాతం లోపు ఓట్లకు పరిమితమై కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా బి‌జే‌పి రావడం కష్టమే. ఇటీవల వస్తున్న కొన్ని సర్వేల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని వస్తున్నాయి. అటు కొన్ని సర్వేలు బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.

ఇటీవల వచ్చిన సర్వే బట్టి చూస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకి 40 శాతం, కాంగ్రెస్‌కు 35 శాతం ఓట్లు ఉన్నాయని తేలింది. అటు బి‌జే‌పికి 8 శాతం మాత్రమే ఓటింగ్ కనిపిస్తుంది. మిగిలిన వారు న్యూట్రల్ గా ఉన్నారు. వారు ఎన్నికల్లో అప్పుడు పరిస్తితులని బట్టి ఓటు వేయనున్నారు. అలాగే పోల్ ట్రాకర్ అనే సర్వే సంస్థ విడుదల చేసిన వివరాల్లో కాంగ్రెస్ 69-71 సీట్లు, బి‌ఆర్‌ఎస్ 39-41 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. అటు మజ్లిస్ 6-7 సీట్లు, బి‌జే‌పి 5-6 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది.

ఇలా ఏ సర్వే చూసుకున్న బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించి అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్తితి. మొత్తానికి ఈ సారి తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version