టిడిపి అధినేత చంద్రబాబు ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఆయన పరిస్తితి రోజురోజుకూ ఇబ్బందిగానే మారుతుంది. అరెస్ట్ తో అటు ఆయనకు వ్యక్తిగతంగా, ఇటు పార్టీ పరంగా భారీ డ్యామేజ్ జరుగుతుంది. మొన్నటివరకు ఒక ఊపులో ఉన్న పార్టీ ఇప్పుడు దారుణమైన పరిస్తితుల్లో ఉంది. బాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో పరిస్తితులు మారిపోయాయి. ఇక బాబు ఇప్పటికే స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని సిఐడి కస్టడీకి ఇచ్చే అంశం చర్చగా మారింది.
అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్ లో ఉంది. ఆ పిటిషన్ కొట్టేస్తారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసులు ఆయనపై ఉన్నాయి. వీటిల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులు అన్నీ చుట్టుముట్టిన సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్..బాబు కేసుని సిబిఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో బాబుకు మరింత కష్టం వచ్చి పడింది. అది గాని కోర్టు పిటిషన్ తీసుకుని విచారించి..సిబిఐకి ఇస్తే ఇంకా దారుణమైన పరిస్తితులు ఉంటాయని టిడిపి శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
ఇక బాబు ఇప్పుడే బయటకురారు అని టిడిపి శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, ఎన్నికల వరకు బాబుని బయటకురానివ్వరు అని భావిస్తున్నారు. అప్పటివరకూ రాకపోతే టిడిపి పరిస్తితి మరింత దిగజారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే టిడిపి పరిస్తితి రోజురోజుకు దిగజారుతుంది. అటు వైసీపీ బలం మరింత పెరుగుతుంది.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు చేసే రచ్చ వల్ల మైనస్ తప్ప ప్లస్ కనిపించడం లేదు. మొత్తానికి చూస్తే టిడిపి డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. అసలు చావో రేవో లాంటి ఎన్నికలు ఉన్నప్పుడు టిడిపి ఇలాంటి పరిస్తితుల్లో ఉండటం ఇబ్బందికరమనే చెప్పాలి. ఇదే పరిస్తితి కొనసాగితే టిడిపి కథ ముగింపు దశకు వచ్చినట్లే.