పృథ్వీరాజ్‌తోపాటు కమెడియన్ అలీకి కూడా ఏపీలో ఓ నామినేటెడ్ పోస్టు ఇస్తారని ఇటీవలే బాగా ప్రచారం జరిగింది. ఇక అందరూ అనుకున్నట్లుగానే పృథ్వీరాజ్‌కు పదవి దక్కింది. దీంతో అలీకి కూడా పదవి ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
సినీ నటుడు, వైకాపా నాయకుడు పృథ్వీ రాజ్‌కు సీఎం జగన్ ఇటీవలే ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూలై 28వ తేదీన పృథ్వీరాజ్ ఆ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే మరొక నటుడికి కూడా జగన్ ఓ పదవిని ఇచ్చారని ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అతనెవరో కాదు.. అలీ.. అవును.. పృథ్వీరాజ్‌తోపాటు కమెడియన్ అలీకి కూడా ఏపీలో ఓ నామినేటెడ్ పోస్టు ఇస్తారని ఇటీవలే బాగా ప్రచారం జరిగింది. ఇక అందరూ అనుకున్నట్లుగానే పృథ్వీరాజ్‌కు పదవి దక్కింది. దీంతో అలీకి కూడా పదవి ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
సీఎం వైఎస్ జగన్ గతంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఎన్నికల సమయంలో.. కమెడియన్ అలీ తన స్నేహితుడైన పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరేందుకు యత్నించారు. కానీ పవన్ అందుకు నిరాకరించడంతో అలీ వైసీపీలో చేరారు. అయితే అనూహ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో.. గతంలో ఆ పార్టీకి మద్దతునిచ్చిన నేతలు, సినీ ప్రముఖుల పంట పడింది. అందులో భాగంగానే పృథ్వీ రాజ్‌కు ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఇక ఎన్నికల సమయంలో వైకాపాలో చేరి.. ఆ పార్టీకి ప్రచారం చేసిన అలీకి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి (ఏపీఎఫ్డీసీ) చైర్మన్ పదవి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు ఏపీ ప్రభుత్వం గానీ, ఇటు అలీ కానీ అధికారిక ప్రకటన వెలువరించలేదు. దీంతో ఈ వార్త నిజం కాదని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడీ విషయం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.