ప్రైవేటు స్కూల్స్ నెత్తిన బాంబ్ వేసిన సీఎం జగన్.. ఇకపై 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాల్సిందే..!

-

ఏపీలో ఇకపై ప్రైవేటు స్కూళ్ల దూకుడుకు కళ్లెం పడనుంది. తల్లిదండ్రులకు అధిక ఫీజులు కట్టే బాధ తప్పనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్లును అందుబాటులోకి తెచ్చింది.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేసినప్పటి నుంచి జనరంజక పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు మెచ్చిన సీఎంగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ మరొక కీలకమైన చట్టాన్ని తెచ్చి పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఊపిరిపీల్చుకునేలా చేశారు. ఇకపై ఏపీలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం వరకు సీట్లను విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిందేనన్న నిబంధనలతో కూడిన నూతన చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆమోదించారు.

ఏపీలో ఇకపై ప్రైవేటు స్కూళ్ల దూకుడుకు కళ్లెం పడనుంది. తల్లిదండ్రులకు అధిక ఫీజులు కట్టే బాధ తప్పనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్లును అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఈ బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించారు కూడా.

ఏపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్లుపై జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఏపీలోని ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును తెచ్చామని తెలిపారు. ఈ బిల్లుతో ఇకపై ప్రైవేటు స్కూల్స్ తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తామంటే కుదరదన్నారు. ప్రతి ప్రైవేటు స్కూల్‌లోనూ విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలని, అధిక ఫీజులు కట్టలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా ఈ కమిషన్‌కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్మన్‌గా ఉంటారని, ఇందులో 11 మంది సభ్యులు ఉంటారని, వీరికి ఎప్పుడైనా ఏపీలోని ఏ స్కూల్‌కైనా వెళ్లి తనిఖీలు చేసే అధికారం ఉంటుందన్నారు. స్కూళ్ల గ్రేడింగ్, విద్యాహక్కు చట్టం అమలును, అక్రిడేషన్‌ను వీరు పర్యవేక్షిస్తారని జగన్ తెలిపారు. ఈ క్రమంలో ఈ బిల్లు వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version