గడప గడపకు వెళ్ళి…మనం అమలు చేసిన పథకాల గురించి చెప్పి…గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా చెప్పి…ప్రజల మద్ధతు పొందిన వారికే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని సీఎం జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేశారు..ఈ మధ్య వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు…అసలు గడప గడపకు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించిన ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు…ఆరు నెలల్లోపు మంచి పని తీరు కనబర్చకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు…ఆరు నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలని అన్నారు.
సరే ఎమ్మెల్యేలని జనంలోకి వెళ్ళి..గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ బాగానే చెప్పారు…మరి ఇంత చెప్పినా కూడా ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నారా? అంటే అబ్బే పెద్దగా లేదనే చెప్పాలి…ఏదో కొంతమంది మాత్రం తప్ప..మిగిలిన వారు ఇంకా ఎఫెక్టివ్ గా కార్యక్రమం మొదలుపెట్టలేదు. ఏదో గ్రాఫ్ పెంచుకోమని జగన్ చెప్పేశారు…కానీ ప్రజలు సమస్యలపై నిలదీస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్తితి. కేవలం పథకాలు ఒక్కటే ఇస్తే సరిపోతుందా అని ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు.
రోడ్లు, డ్రైనేజ్ ల..ముఖ్యంగా తాగునీరు సౌకర్యం అడుగుతున్నారు. కానీ ఇవి కూడా సక్రమంగా చేయడానికి ఎమ్మెల్యేలకు నిధులు అందడం లేదు..తాజాగా జగన్ సచివాలయానికి 20 లక్షలు ఇస్తానని చెప్పారు..మరి ఆ నిధులు ఎంతవరకు సరిపోతాయనేది తెలియడం లేదు. పైగా అన్నిటికంటే పథకాలకు బటన్ నొక్కి డబ్బులు వేసేది జగన్…పథకాలు ఎవరికి అందాలో డిసైడ్ చేసేది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది…ఇక మధ్యలో తాము చేసేది ఏమి లేదంటూ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బటన్ నొక్కడం వల్ల జగన్ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప…తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని వారు లోలోపల ఇబ్బంది పడుతున్నారు.
అయితే ప్రజల నుంచి వచ్చే నిరసనలు తట్టుకోలేక కొందరు ఎమ్మెల్యేలు పెద్దగా గడప గడపకు వెళ్ళడం కష్టమైపోయింది..ఈ క్రమంలోనే జగన్…జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పథకాలకు బటన్ నోక్కే కార్యక్రమాలని ప్రజల్లోనే చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులని ప్రజల్లో ఉండాలని సూచించారు. ఇలాగైనా కాస్త పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలని కలిసి వారి సమస్యలని తెలుసుకుని, వారికి నిధులు కేటాయించే కార్యక్రమాలు జరగలేదు. దీనిపైనే ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అందుకే జగన్ ఇంకా…వరుసపెట్టి ఎమ్మెల్యేలని కలవడం, వారి నియోజకవర్గంలో కావాల్సిన పనులకు నిధులు కేటాయించడం లాంటివి చేయనున్నారని తెలుస్తోంది. అలాగే నియోజకవర్గంలో 50 మంది వరకు కార్యకర్తలని కలిసి..పార్టీ పరిస్తితిని తెలుసుకుంటారని సమాచారం. మొత్తానికైతే ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచడానికి జగనే రంగంలోకి దిగుతున్నారు…మరి చూడాలి ఇక్కడనుంచైనా ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుందేమో.