ఎడిట్ నోట్: తారక్ చేతిలోకి టీడీపీ..!

-

గతంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఏ విధంగా టీడీపీని దక్కించుకున్నారో…త్వరలో అదేవిధంగా చంద్రబాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని తీసుకుంటారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలని గుర్తు చేస్తూ.. అక్కడ ఏకనాథ్ షిండే మాదిరిగానే…టీడీపీని ఎన్టీఆర్ తీసుకుంటారని అన్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి షిండే మాదిరిగా చంద్రబాబు పార్టీ లాక్కున్నారని, సేమ్ షిండేగా ఇప్పుడు ఎన్టీఆర్ మారి చంద్రబాబు దగ్గర నుంచి పార్టీని తీసుకుంటారని, ఒకేసారి బాబు ప్రతిపక్ష హోదా, పార్టీ అధ్యక్షుడు పోతాయని మాట్లాడారు.

అయితే కొడాలి రాజకీయంగా విమర్శలు చేశారని అనుకోవచ్చు…కానీ జూనియర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి మాటల్లో అంతరార్ధం వేరుగానే ఉంటుంది. గతంలో కొన్ని దుష్టశక్తులు టీడీపీని నాశనం చేయడానికి చూడటంతో…తాను అందరి మద్ధతుతో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని తీసుకున్నానని బాబు చెబుతూనే ఉంటారు.

బాధ కలిగించే విషయమైన సరే పార్టీని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్తితుల్లో పార్టీని కాపాడుకోవడానికి ఆ పని చేశానని బాబు ఇప్పటికీ చెబుతారు. సరే అయిందో అయింది…కానీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి బాబు పార్టీ లాక్కున్నారనే మచ్చ మాత్రం ఉంది. సరే ఏదొకవిధంగా బాబు పార్టీని నిలబెట్టారు..ఇప్పటికి నడిపిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ హవా ముందు బాబు తేలిపోయారు. దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

ఇలాంటి సమయంలో పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ కొందరు కార్యకర్తల నుంచి వచ్చింది. పార్టీని సమర్ధవంతంగా నడిపించే సత్తా ఎన్టీఆర్‌కు ఉందని, ఆయనకు పార్టీని అప్పగించేయాలని పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు మాట్లాడారు. ఇప్పటికీ పార్టీలో ఎన్టీఆర్ నినాదం ఇంకా కొనసాగుతుంది. అయితే ఏదొకవిధంగా బాబు పార్టీని పైకి తీసుకొస్తున్నారు…మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.

దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం, ఏపీలో బలపడటం కోసం బీజేపీ, ఎన్టీఆర్‌ని వాడుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ చేత టీడీపీని చంద్రబాబు దగ్గర నుంచి లాక్కునే కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు. ఎలాగో చంద్రబాబుతో కలవడం మోదీ-షాకు ఇష్టం లేదు…అందుకే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తే…అప్పుడు టీడీపీ సపోర్ట్ తో బలపడవచ్చు అనేది బీజేపీ ప్లాన్ అని అంటున్నారు.

ఇదే విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చెబుతున్నారు…ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన నాని..బాబు దగ్గర నుంచి టీడీపీని ఎన్టీఆర్ తీసుకుంటారని అంటున్నారు. కొడాలి నాని మాత్రమే కాదు…చాలామంది ఈ డౌట్ లోనే ఉన్నారు. దీంతో టీడీపీలో కాస్త అలజడి కనిపిస్తోంది. అయితే టీడీపీని బాబు అంత తేలికగా చేజార్చుకుంటారా? అలాగే ఎన్టీఆర్…అసలు పార్టీని లాగే కార్యక్రమం చేస్తారా? అసలు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారా? అనేది డౌటే. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే..కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు…ఎన్టీఆర్‌ని షా కలవడం వెనుక మాత్రం రాజకీయ కోణం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version