కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన పంజా విసురుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఆ వైరస్‌తో అతలాకుతలం అవుతోంది. ఇక అన్ని దేశాల్లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. అయితే కరోనా వైరస్‌కు చైనాయే కారణమంటూ అమెరికా మొదట్నుంచీ ఆరోపిస్తోంది. ఆ వైరస్‌ను చైనాయే తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని.. కరోనా చైనా వైరస్.. అని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక అమెరికా బాటలోనే జపాన్ కూడా నడుస్తోందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
చైనాలో ఉన్న తమ కంపెనీలను జపాన్ వెనక్కి రమ్మని ఆదేశిస్తోంది. అందుకు గాను ఆయా కంపెనీలకు 2.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కూడా జపాన్ తాజాగా ప్రకటించింది. ఆ మొత్తంలో 2 బిలియన్ డాలర్లను కంపెనీలను జపాన్‌కు తరలించేందుకు ఉపయోగించాలని జపాన్ నిర్ణయించింది. ఈ క్రమంలో చైనాలో ఉన్న జపాన్ కార్యాలయాలు, పరిశ్రమలను అక్కడి నుంచి తీసేసి వాటిని తిరిగి జపాన్‌లో స్థాపించనున్నారు. ఇక మిగిలిన 0.2 బిలియన్ డాలర్లను ఇతర దేశాలకు పరిశ్రమలను తరలించేందుకు జపాన్ ఉపయోగించనుంది.
కాగా చైనా, జపాన్‌లకు అంతకు ముందు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కానీ కరోనా వైరస్ పట్ల చైనా అనుమానాస్పద ధోరణిలో వ్యవహరిస్తున్నందునే.. ఆ దేశంతో తమకున్న సంబంధాలను కట్ చేసుకోవాలని జపాన్ భావిస్తోంది. అందులో భాగంగానే చైనాలో ఉన్న తమ పరిశ్రమలన్నింటినీ తిరిగి తమ దేశానికే తరలించేందుకు జపాన్ చర్యలను ప్రారంభించింది. అయితే జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆసియా దేశాల మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇక చైనా ప్రధాని జిన్ పింగ్ ఈ నెలలో జపాన్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆ కార్యక్రమం రద్దయింది. దీంతో జిన్ పింగ్ ఇప్పుడప్పుడే జపాన్ వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ కూడా తన మానుఫాక్చరింగ్ ప్లాంట్లను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని చూస్తున్నట్లు తెలిసింది. అదే నిజమైతే ఆపిల్ తన ప్లాంట్లను భారత్‌కు తరలించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెరికా కూడా చైనాను ప్రపంచం ఎదుట దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆ దేశానికి చెందిన కంపెనీలన్నీ ఇప్పుడు చైనా నుంచి ఇతర దేశాలకు తరలివెళ్తాయని అనుకుంటున్నారు. అలాగే నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఫిన్‌లాండ్ తదితర దేశాలు కూడా అమెరికా, జపాన్‌ల బాటలో నడవాలని చూస్తున్నట్లు తెలిసింది. అదే నిజమైతే.. చైనా భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..!