చిరంజీవిని ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్…!

-

టాలీవుడ్ లో ఆచార్య సినిమా కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దసరాకు విడుదల చేసే విధంగా చిత్ర యూనిట్ సిద్దమవుతున్న తరుణంలో వచ్చిన కరోనా వైరస్ సినిమాను ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఆగిపోయింది. ఎప్పుడు మొదలవుతుంది అనేది స్పష్టత లేదు.

ఇది పక్కన పెడితే ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా కీలక పాత్రకు ముందు మహేష్ బాబుని తీసుకునే అవకాశం ఉందని భావించినా అది నిజం కాదని రామ్ చరణ్ ని ఆ పాత్రకు ఎంపిక చేసారని అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినా సరే పవన్ నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడానికి సిద్దమయ్యాడు. ఇది పక్కన పెడితే…

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రామ్ చరణ్ రెడీ గా లేరు అని సమాచారం. దానికి కారణం ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంటుంది. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. దీనితో ఇప్పుడు ఆచార్య సినిమా షూటింగ్ లోకి తాను రావాలి అంటే కనీసం 20 రోజులు ఆలస్యం అవుతుందని రామ్ చరణ్ చెప్పాడట. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. కరోనా ఉంది కాబట్టి మరి ఆ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో… రామ్ చరణ్ ఎప్పుడు వస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version