Exclusive : ఆ డిఎస్పి ఏమయ్యాడు..!

-

మ్యూజిక్ మిరాకిల్ దేవి శ్రీ ప్రసాద్.. ఎప్పుడూ కొత్త మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకులను రెండు దశాబ్ధాలుగా అలరిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య తన సత్తా చాటడంలో వెనుకపడుతున్నాడు. తన మ్యూజిక్ తో తానే ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య ఎందుకో వెనుకపడ్డాడు. చేతిలో సినిమాలు ఉన్నా.. స్టార్ అవకాశాలు వస్తున్నా మునుపటిలా దేవి మనసు పెట్టి మ్యూజిక్ ఇవ్వట్లేదు అన్నది అందరు అంటున్నమాట.

దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంటే సినిమా ఎలా ఉన్నా పాటలు సూపర్ అనేలా ఉంటాయి. కాని ప్రస్తుతం ఓ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ డిఎస్పి అని థియేటర్ కు వెళ్లాక కాని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమధ్య ఆయన చేస్తున్న సినిమా పాటల్లో ఇదవరకు అతను వాడిన ట్యూస్ వినిపిస్తున్నాయి. అది తప్పేం కాదు కాని కొత్తగా ఎందుకు దేవి శ్రీ ట్రై చేయట్లేదు అన్నది ఫ్యాన్స్ వాదన.

వచ్చిన పేరు చాలనుకున్నాడో లేక ఇక కష్టపడటం ఎందుకు అనుకున్నాడో ఏమో కాని డిఎస్పి మ్యూజిక్ అంటే వినగానే నచ్చే పాటలు ఇప్పుడు ఎంత విన్నా రుచించడం లేదు. రీసెంట్ గా మహేష్ మహర్షి సినిమా మొదటి పాట చోటి చోటి బాతె సాంగ్ కూడా ట్యూన్ ట్రెండీగా ఉన్నా దేవి మార్క్ మిస్సయ్యిందని అందరు అంటున్నారు. ఓ పక్క యువ సంగీత దర్శకులు తమ సంగీతంతో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంటే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం చేస్తున్న మూడు నాలుగు సినిమాల్లో ఒక సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చి మిగతా వాటికి మమా అనిపిస్తున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ పద్ధతి మార్చుకోకపోతే అతన్ని దర్శక నిర్మాతలు కచ్చితంగా అతన్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ స్టార్ ఛాన్సులు అందుకుంటున్న దేవి శ్రీ ప్రసాద్ ఇకనుండైనా తన అసలు టాలెంట్ చూపించేలా మ్యూజిక్ అందిస్తే బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version